Devara : దేవర నుంచి జాన్వీ లేటెస్ట్ పోస్టర్ చూశారా.. ఎంత ముద్దుగా ఉందో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర పార్ట్ 1.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర పార్ట్ 1.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా దేవర టీమ్ జాన్వీ అభిమానులకు గొప్ప ట్రీట్ ఇచ్చింది. జాన్వీ కపూర్ దేవర సినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. జాన్వీ కపూర్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవరలో జాన్వీ కపూర్ తంగం పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పూర్తిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
దేవర మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు వెల్లడించారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దేవర సినిమాలో కోస్తాంధ్ర ప్రజలకు అండగా నిలిచే నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. దేవర చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దేవర చిత్రానికి హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో దేవర పార్ట్ 1 రూపొందుతున్నట్లు సమాచారం.