»Sandeep Reddy Vanga Had Darshan Today At Tirumala
Sandeep Reddy Vanga : తిరుమలలో సందడి చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ
గతేడాది యానిమల్ సినిమాతో చరిత్ర సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తిరుపతిలో సందడి చేశారు. నేడు ఆయన కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Sandeep Reddy Vanga : గతేడాది యానిమల్ సినిమాతో చరిత్ర సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తిరుపతిలో సందడి చేశారు. నేడు ఆయన కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. యానిమల్ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీసు దుమ్ము దులిపింది. ఇక ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తలనీలాలు సైతం సమర్పించారు. అనంతరం బయటకువచ్చి సెలబ్రిటీ పాయింట్ వద్ద ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఇక కొందరు భక్తులు సందీప్‌ను గుర్తు పట్టి ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇలా తిరుమలలో గుండుతో కనిపించిన సందీప్ రెడ్డి వంగా కొత్త లుక్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఒక అభిమాని నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని అడుగగా.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి స్పిరిట్ మూవీ చేస్తున్నట్లు తెలిపారు. సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి తెలుగులో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అదే కథను హిందీలో కబీర్ సింగ్‌గా తీస్తే 300 కోట్లు వచ్చాయి. ఇక యానిమల్ సినిమా అయితే అక్కడి రికార్డులను బద్దలు కొట్టేసింది. యానిమల్ పార్క్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని, యానిమల్ కంటే రెట్టింపు ఉంటుందని సందీప్ వంగా అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.