»Popular Singer Vaddepalli Srinivas Passed Away Due To Illness
Tollywood Singer: విషాదంలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖ సింగర్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది..ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్(73) అకస్మాత్తుగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Tollywood Singer: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది..ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్(73) అకస్మాత్తుగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కారణం చేతనే ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని స్వగృహంలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమే కాకుండా జానపద కళాకారులు శోక సంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు, జానపద కళాకారులు శ్రీనివాస్‌కు నివాళులు అర్పించి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తన కెరీర్ లో వడ్డేపల్లి శ్రీనివాస్ 100కి పైగా పాటలు, అనేక జానపద గీతాలు ఆలపించారు. అంతేకాదు గజ్జె కట్టి పలు వేదికలపై తనదైన ఆటలతో అలరిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. 2012లో రిలీజైన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో గున్ను లాఠీ కన్నులున్న జున్ను లాంటి పిల్ల అనే పాటతో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. వడ్డేపల్లి శ్రీనివాస్ ఆ సినిమానే కాదు కింగ్, బెంగాల్ టైగర్, నమస్తే అన్న తదితర చిత్రాల్లో పాటలు పాడాడు.