»Deepika Padukone Ranveer Singh Soon To Become Parents
Deepika Padukone: తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. ఇప్పుడు ఎన్నో నెలంటే ?
దీపికా పదుకొనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు, రణ్వీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని పేర్కొంది. తాము కూడా ఓ ఫ్యామిలీని మొదలు పెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు దీపికా పదుకోన్ చెప్పింది.
Deepika Padukone : దీపికా పదుకొనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు, రణ్వీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని పేర్కొంది. తాము కూడా ఓ ఫ్యామిలీని మొదలు పెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు దీపికా పదుకోన్ చెప్పింది. అయితే అంతలోపే ఆమె తల్లి కాబోతోందన్న వార్తలు వస్తుండటం గమనార్హం. ఈ మధ్యే బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్ గా పార్టిసిపేట్ చేసింది. బెంగళూరులో పుట్టిన దీపిక తొలిసారి కన్నడ సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో దాదాపు అందరు సూపర్‌హీరోలతో నటించింది. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్నారు. హిందీలో సింగం రిటర్న్స్ చేస్తోంది. తాజాగా దీపికా పదుకొణె బాఫ్తా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో పాల్గొంది. చీరలో తళుక్కుమంది. అయితే సరిగ్గా గమనిస్తే ఆమెకు బేబీ బంప్ ఉందా అని చాలా మందికి అనుమానం వచ్చింది. వేడుక నుండి తిరిగి వచ్చిన తర్వాత, దీపిక వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. దీంతో దీపిక గర్భవతి అనే సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ చివరి దశలో ఉన్నాయి. అలాగే ఆమె బేబీ బంప్‌తో కనిపించడం, ప్రెగ్నెన్సీ పుకార్లు రావడం చూస్తుంటే త్వరలోనే ఆమె శుభవార్త చెబుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది దీపికా పదుకొనే!