Aishwarya gets engaged : ప్రముఖ సినిమా దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య( Aishwarya) నిశ్చితార్థం ఆదివారం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకతో వారి ఇంట సందడి నెలకొంది. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌ని ఆమె వివాహమాడనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారాయి.
శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తి రీత్యా వైద్యురాలిగా పని చేస్తున్నారు. కాగా ఇది ఆమెకు రెండో పెళ్లి . తొలుత ఆమె 2021లో క్రికెటర్ రోహిత్ ని వివాహం చేసుకున్నారు. తర్వాత రోహిత్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె ఆయనతో విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తరుణ్ కార్తీక్‌తో ఆమె నిశ్చితార్థం(engagement) జరిగింది.
శంకర్(Shankar) సినిమాలకు తరుణ్ కార్తీక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు2, రామ్ చరణ్ నటిస్తున్న గేంమ్ ఛేంజర్ అనే పాన్ ఇండియా సినిమాలతో శంకర్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఇవి రెండూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయని. ఇదిలా ఉండగా శంకర్ మరో కుమార్తె అదితి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె మంచి సింగర్ కూడా. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ సినిమాలో రోమియో జూలియట్ పాటను ఆమే పాడారు.