జూన్ 16న విడుదలకు సిద్ధమవుతున్న ఓం రౌత్ 'ఆదిపురుష్(Adipurush)' ట్రైలర్ మంగళవారం సాయంత్రం తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేయబడింది. ఈ చిత్రంలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్టార్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన 'ఆదిపురుష్(Adipurush)' మూవీ ప్రి రిలీజ్ వేడుకను నిన్న(జూన్ 6న) ఏపీలోని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి వచ్చారు. అయితే ఈ వేడుక చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. పూర్ణకుంభంతో ప్రభాస్ దగ్గరుండి ఆయన్ని ఆహ్వానించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో.. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ కోసం.. ఫాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఆదిపురుష్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ విషయంలో భారీ ఎత్తున చేతులు మారింది. తాజాగా దిల్ రాజు ఆదిపురుష్‌కి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్(Second trailer Release)లో పోరాట సన్నివేషాల సీన్స్ కట్ చేసి వదిలారు. విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
'టక్కర్' మూవీ(Takkar Movie) నుంచి ఎపిసోడ్ 1 వీడియోను మేకర్స్ రిలీజ్(Video Release) చేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.
ప్రతి కథ అందరికీ నచ్చాలని లేదు. ఓ హీరో చేయాల్సిన సినిమాను.. మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామన్. ఇప్పుడు బాలయ్య విషయంలోను ఇదే జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ రిజెక్ట్ చేసిన కథతో.. బాలయ్యను ఇంప్రెస్ చేసి.. అనౌన్స్మెంట్‌కు రెడీ అవుతున్నాడట బాబీ.
కెజియఫ్‌తో సంచలనం సృష్టించాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ముందుగా ఈయనను కన్నడ డైరెక్టర్ అనుకున్నారు. కానీ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. ఇప్పుడు కన్నడను వదిలిపెట్టి టాలీవుడ్ బడా హీరోలే టార్గెట్‌గా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.
మెగాభిమానులు ఓ విషయంలో ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతునే ఉన్నారు. మిగతా హీరోలు స్ట్రెయిట్ మూవీస్ చేస్తుంటే.. చిరు, పవన్ మాత్రం రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అది కూడా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమా తమిళ్ రీమేకే.. అయినా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో వర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం లీడ్ రోల్స్ చేసే రేంజ్‌కు ఎదిగాడు. కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. తాజాగా ఆయన భార్య షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భులాయా2 సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కియారా అద్వాణీ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా ఈ మూవీ హిట్ కావడంతో ఈ జోడీ మరోసారి జంట గా రావడానికి రెడీ అయ్యింది.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తోన్న యంగ్ రెబల్ స్టార్, హీరో ప్రభాస్‌కు 100 మంది సెక్యూరిటీ కల్పించనున్నారు. వీరిలో కొందరు బౌన్సర్లు కూడా ఉన్నారు. మరికొందరు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు.
సినిమా వాళ్ల లైఫ్ అందరికీ తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై కనిపించినంత బ్యూటీఫుల్‌గా వాళ్ల రియల్ లైఫ్ ఉండదు. ఎన్నో అవాంతరాలు, అవమానాలు ఎదుర్కొని.. నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు జీవితంలో చెరిగిపోని తప్పు చేసేలా చేస్తాయి. తాజాగా అదే విషయాన్ని చెబుతూ.. ఓ నటి చాలా ఎమోషనల్ అయింది. ఆమె ప్రైవేట్ వీడియో లీక్ చేశారని ఆవెదనుకు గురైంది.