నిజమే.. ఈ సారి దసరా వార్ గట్టిగా జరగబోతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. ఈ ముగ్గురు మధ్య ఊరమాస్ పోటీ ఉండబోతోంది. కానీ ఈ ముగ్గురికి పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడు. దీంతో ఓ టాలీవుడ్ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వల్ల బాలయ్య, రవితేజకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు.
డీజె టిల్లు లొల్లి గురించి అందరికీ తెలిసిందే. డీజె టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టేశాడు. మనోడి 'డీజే' సౌండ్ మోత ఇంకా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అట్లుంటది మనతో.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయంది. దాంతో 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్‌గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అనుపమా పరమేశ్వరన్ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తి మాంచి దూకుడు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతున్నాడు. రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన కార్తి.. లేటెస్ట్ ఫిల్మ్ జపాన్ రిలీజ్‌కు రెడీ అవుతుండగానే.. ఇప్పుడు మరో డైరెక్టర్‌కు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని టాక్.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆది పురుష్.
అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. వచ్చిన ఛాన్స్‌కు కూడా వదులుకుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వద్దని చెప్పడంతో.. నెటిజన్స్ కాస్త షాక్ అవుతున్నారు. ఇంతకీ రకుల్ ప్రీత్.. పవన్ కళ్యాణ్‌కు నిజంగానే హ్యాండ్ ఇచ్చిందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. అందుకోసి కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. జనం కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథాచిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది.
కళ్యాణ్‌రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి, విడుదలకు ముందే బింబిసారకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. బింబిసార 2కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, కళ్యాణ్‌రామ్ తన డెవిల్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత త్వరలో ప్రారంభమవుతుందని మేకర్స్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు.
జూన్ 14వ తేది నుంచి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉండనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాతే మళ్లీ షూటింగ్(Shooting) స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పవన్ చేసే సినిమాల షూటింగులన్నీ ఇప్పుడు ఆగిపోనున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.. జూన్ 16న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. కృతి సనన్ సీతగా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రానున్నారు.
కారు ట్రక్కును ఢీకొనడం వల్ల ప్రమాదం(Car Accident) సంభవించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనలో మలయాళీ నటుడు సుధి(Actor Sudhi) ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarai vijayan) సంతాపం తెలిపారు.
సమంతా(Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం “కుషి” పాటల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సామ్ పలు విషయాలను పంచుకుంది.
టక్కర్ మూవీ(Takkar movie) ప్రి రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని వెస్టిన్‌లో జూన్ 4న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక చిత్రాలను ఇప్పుడు చుద్దాం.