విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన వెంకీ మామ.. ఇప్పుడు స్పీడ్ తగ్గించేశాడు. అయినా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తనతోటి సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. వెంకీ మాత్రం రేసులో వెనకబడిపోయాడు. అయినా వెంకీకి కథలు అస్సలు నచ్చడం లేదట.
తనదైన లవ్ స్టోరీస్‌తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తేజ.. ఇక మాటలకే పరిమితమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈయన మాటలేమో సూపర్ హిట్.. కానీ సినిమాలే దారుణం.. అనేలా మారింది పరిస్థితి. తేజనే కాదు.. ఈ విషయంలో ఆయన గురువు ఓ మెట్టు పైనే ఉన్నాడు. మరి తేజ పరిస్థితేంటి!?
సంక్రాంతి అంటేనే.. సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఏ హీరో అయిన సరే.. సంక్రాంతి బరిలో ఉండాలనుకుంటారు. మేకర్స్ అయితే పట్టుబట్టి మరీ సంక్రాంతికి తమ తమ సినిమాల8 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి. వచ్చే సంక్రాంతికి ప్రభాస్, మహేష్ బబు, పవన్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ వాళ్లకు పొలిటికల్ సెగ కాస్త గట్టిగానే తగిలేల...
అప్పట్లో విజయం సాధించిన లస్ట్ స్టోరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తాజాగా లస్ట్ స్టోరీస్2కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీలో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ వంటి స్టార్స్ నటించారు.
కార్తీ డిఫరెంట్ జోనర్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచాడు. అతని చిత్రం జపాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే జపాన్ మూవీ నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది.
తన రాబోయే పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్(Prabhas) ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.
తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం రాబోతుంది. అదే భీమదేవరపల్లి బ్రాంచి(Bheemadevarapally branch) మూవీ. అయితే ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు ప్రివ్యూ షోలు చూసిన సినీ ప్రముఖులు, ఐదుగురు మినిస్టర్స్, ముగ్గురు ఎంపీలు ఈ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
తన తాజా చిత్రం "టక్కర్" తెలుగు వెర్షన్ కోసం ప్రమోషన్ల మధ్య, నటుడు సిద్ధార్థ్(Siddharth) హీరోయిన్ తో తన డేటింగ్ గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం చెప్పి కవర్ చేశాడు. ఇది నా గురించి, కానీ టక్కర్ చిత్రానికి పూర్తిగా సంబంధం లేదని పేర్కొన్నాడు.
మహేష్ బాబు(Mahesh Babu) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ నైట్ పార్టీకి వెళ్లిన ఫొటోలను పోస్ట్ చేశారు. అవి చూసిన అభిమానులు వావ్, లవ్ యూ మహేష్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ప్రస్తుతం ఆదిపురుష్ దెబ్బకు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసిన అంతా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్‌ని ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మరో 24 గంటల పాటు ఆదిపురుష్ హవా ఉండనుంది. తిరుపతిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరుకానున్నారు. లక్షల్లో అభిమానులు తరలి రానున్నారు...
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మానుషి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. ఎక్కడకు వెళ్లినా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సైతం అద్భుతంగా మెరిసింది.
'ఆగస్ట్ 6 రాత్రి' సినిమా('August 6 Ratri' Movie) క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని, ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం తిరుపతి అయోధ్యను తలపిస్తోంది. అడుగడుగునా ప్రభాస్ ఆదిపురుష్ కటౌట్సే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ పేరే జపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయని సాహసం చేశారు.