టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హీరోయిన్ కాజల్(Kajal). ఈ అమ్మడు చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ భామ సినిమాలకు గుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్(Kajal)అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్ అగర్వాల్. అయితే, కాజల్ తన కెరీర్ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం తల్లిగా తన కొడుకు అలాగే కోడలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాతృత్వం కోసం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది కాజల్ అగర్వాల్. కాగా కాజల్ 2020లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడు.
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కాజల్ ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవత్ కేసరి సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా(social media)లో చక్కర్లు కొడుతోంది. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు ప్రధాన కారణం తన బాబు నీల్ అని తెలుస్తోంది. సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తోందని, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.