»Bollywood Actor Kapil Sharma Co Star Tirthanand Rao Who Drank On Pesticides Facebook Live
Facebook live:లో పురుగుల మందు తాగిన నటుడు
ఓ మహిళ కారణంగా బాలీవుడ్ నటుడు దారుణానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లైవ్ సెషన్లో పురుగుల మంది సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తెలుసుకున్న అతని స్నేహితులు అతని ఇంటికి వచ్చిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
బాలీవుడ్ నటుడు, కపిల్ శర్మ(kapil sharma) మాజీ సహనటుడు తీర్థానందరావు(tirthanand rao) ఏకంగా ఫేస్బుక్ లైవ్‌లో పురుగుల మందుతాగేసాడు. ఇతన్ని ఓ మహిళ మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తోందని.. డబ్బును కూడా లాక్కుందని వెల్లడించాడు. ఆ క్రమంలో అతను తన ప్రస్తుత స్థితికి కారణమైన మహిళను నిందించాడు. ఆమె కారణంగా ఎలా అప్పుల్లో చిక్కుకున్నాడో కూడా వెల్లడించాడు. ఇది గమనించిన అతని స్నేహితులు వెంటనే అతని ఇంటికి వెళ్లారు. అప్పడు అతను అపస్మారక స్థితిలో పడి ఉండగా..ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో వారి స్నేహితులు ఊపిరిపీల్చుకున్నారు.
ఓ మహిళ వల్ల తాను 3 నుంచి నాలుగు లక్షల రూపాయల అప్పుల్లో చిక్కుకున్నట్లు తీర్థానంద(tirthanand rao) వెల్లడించాడు. దీంతోపాటు ఆమె తనపై భయాందర్‌లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తీర్థానంద్ ఆత్మహత్యకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. అతను తన ఆర్థిక పరిస్థితుల కారణంగా డిసెంబర్ 2021లో తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తన ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండగా, తిండిలేక రోజులు గడుపుతున్నానని, రోజుకు ఒక్క వడ పావ్‌తో బతుకుతున్నానని పేర్కొన్నాడు. తీర్థానందరావు కామెడీ సర్కస్ కే అజూబ్లో కపిల్ శర్మతో కలిసి పనిచేశారు. ఇంతకుముందు మరోసారి కమెడియన్‌తో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.