టాలీవుడ్ స్టార్ గోపీచంద్ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రామబాణం’ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ హీరో తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి భీమా(bhimaa) అనే టైటిల్ను ఖరారు చేసి పోస్టర్ను విడుదల చేశారు.
మ్యాచో హీరో గోపీచంద్(Gopichand)కి ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. చాలా కాలం తర్వాత రామబాణం సినిమాతో వచ్చినా, ఆ మూవీ కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో, ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్లను పక్కన పెట్టి, మళ్లీ యాక్షన్ లోకి దూకారు. అలా ఆయన చేస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్లింది. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. కెరియర్ పరంగా గోపీచంద్ కి ఇది 31వ సినిమా. ఇంతవరకూ ఈ సినిమా టైటిల్ ను గోప్యంగా ఉంచుతూ వచ్చారు.
నిన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను.. ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘భీమా(bhimaa)’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ ఫస్టులుక్ ను వదిలారు. డిఫరెంట్ మీసకట్టుతో ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడు. తన రూట్ ని మార్చి ఇప్పుడు రగ్గుడ్ లుక్ తో భీమా చేస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో కచ్చితంగా కంబ్యాక్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవీ బస్రుస్ సంగీతం అందించబోతుండటంతో బ్యాగ్రౌండ్ స్కోర్ పగిలిపోవడం ఖాయమని చెప్పాలి. ఇక ఈ సినిమాతో గోపీచంద్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి. మొదటి నుంచి కూడా గోపీచంద్ యాక్షన్ హీరోగానే ఎక్కువ మార్కులు కొట్టేస్తూ వచ్చాడు. ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా నిరూపించుకున్నప్పటికీ, ఆ తరహా కథల్లోను యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లోనే కొనసాగనుంది. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.