ఒక హీరోని హీరోలా కాకుండా.. మనతో పాటే సమాజంలో ఎక్కడో ఓ చోట జీవిస్తున్నాడనేలా.. తన హీరోలను చూపిస్తాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. మన మూలాలకు వెళ్లి మరీ.. న్యాచురల్‌గా సినిమాలు తీయడంలో వెట్రిమారన్ తర్వాతే ఎవ్వరైనా. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి.
ఒక హీరోని హీరోలా కాకుండా.. మనతో పాటే సమాజంలో ఎక్కడో ఓ చోట జీవిస్తున్నాడనేలా.. తన హీరోలను చూపిస్తాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. మన మూలాలకు వెళ్లి మరీ.. న్యాచురల్‌గా సినిమాలు తీయడంలో వెట్రిమారన్ తర్వాతే ఎవ్వరైనా. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. రియాల్టికి దగ్గరగా సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నారు. అసలు సమాజంలో ఇలాంటివి కూడా జరుగుతాయా.. అనే కోణంలో వెట్రిమారన్ సినిమాలు ఉంటాయి. ప్రజెంట్ ఆయన నుంచి ‘విడుదల పార్ట్1’ అనే సినిమా తెలుగులోకి డబ్ అవుతోంది. అల్లు అరవింద్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. వెట్రిమారన్ తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడుంటుంది.. ఎలా ఉంటుందనే క్వశ్చన్ ఎదురైంది. అల్లు అర్జున్‌ని ఒకట్రెండుసార్లు కలిశాను.. కానీ కుదరలేదు. మహేశ్‌బాబుకు కూడా ఒక కథ చెప్పా. ఎందుకో వర్కౌట్ అవలేదు. ఇక ‘అసురన్’ మూవీ తర్వాత, లాక్డౌన్ అనంతరం ఎన్టీఆర్‌ను కలిశాను. తారక్‌తో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ, అందుకు చాలా సమయం పడుతుంది. అయితే స్టార్ వాల్యూ, కాంబినేషన్ వాల్యూ కాకుండా.. కంటెంట్ డిమాండ్ చేస్తేనే సినిమా చేస్తానని అన్నారు. ఈ లెక్కన ఇప్పటికే వెట్రిమారన్ దగ్గర ఎన్టీఆర్‌కు సరిపోయే అదిరిపోయే కంటెంట్ రెడీగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడొచ్చినా కూడా ఈ కాంబినేషన్ మాత్రం మామూలుగా ఉండదు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. యంగ్ టైగర్ నటవిశ్వరూపం వెట్రిమారన్ సినిమాలో చూడొచ్చు. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి.