ఎలాంటి అప్డేట్ ఇచ్చినా.. పూనకాలు లోడింగ్ అంటూ చెబుతున్నాడు ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ. ఒక మెగాస్టార్ అభిమానిగా ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో తెరకెక్కించానని అంటున్నాడు. అందుకు తగ్గట్టే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో.. వరుస అప్డేట్స్ ఇస్తోంది చిత్ర యూనిట్. అలాగే అతి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో.. ఫ్యాన్స్ మీట్లో దర్శకుడు బాబీ సినిమా పై అంచనాలు పెంచేలా కామెంట్స్ చేశాడు. మెగాభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే ఇంట్రో సీన్ తుఫానులా ఉంటుందని అన్నాడు. ఇక రెండ్రోజుల క్రితం చిరంజీవి ఈ సినిమాను చూశాడని.. ఖచ్చితంగా వాల్తేరు వీరయ్య డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పారట. ఇకపోతే.. జనవరి 8న వైజాగ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేదుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారట. జనవరి 4న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ ట్రైలర్ కట్లో బిజీగా ఉందట. త్వరలోనే దీని పై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక.. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో.. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను.. 2023 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. మరి వాల్తేరు వీరయ్య ఎలా ఉంటుందో చూడాలి.