హృతిక్ రోషన్(Hrithik roshan) తన ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad) చెప్పులు మోసిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన పలువురు జెంటిల్ మ్యాన్ అని అంటుండగా..ఇంకొంత మంది మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దీని గురించి మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik roshan) తన ప్రియురాలి గురించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎలా అంటే. ఇటీవల తన ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad) చెప్పులను పట్టుకున్నఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు పలువురు హృతిక్ జెంటిల్ మ్యాన్ అని కామెంట్లు చేస్తుండగా…ఇంకొంత మంది మాత్రం ఏంతటి వారైనా మహిళల విషయంలో తగ్గాల్సిందేనేనని అంటున్నారు. ఈ సంఘటన ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఈవెంట్లో భాగంగా చోటుచేసుకుంది.
ఈ కార్యక్రమానికి హృతిక్ రోషన్ అతని ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad) తో కలిసి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. సబా రెడ్ కలర్ బనారసీ చీర గౌనును ధరించింది. డైమండ్ చెవిపోగులు, ఉంగరం, మెరిసే ఐ షాడో, ఓపెన్ ట్రెస్లతో ఆమె కనిపించగా.. మరోవైపు హృతిక్ నలుపు-రంగు కుర్తా-పైజామా సెట్ ధరించాడు. అయితే ఆ వేడుకలో భాగంగా ఒక ఫొటోలో సబా అద్భుతమైన ఎరుపు దుస్తుల్లో డిజైనర్‌తో పోజులు ఇవ్వగా…మరోవైపు హృతిక్ సబా హీల్స్ చెప్పులు పట్టుకుని మరొకరితో మాట్లాడటం గమనించవచ్చు.
ఈ క్రమంలో దీపికా పదుకొణె కోసం కూడా రణ్ వీర్ సింగ్ గత ఏడాది హాజరైన ఒక ఈవెంట్లో ఇదే పని చేశాడని ఒక అభిమాని గుర్తు చేశాడు. అంతేకాదు ఆ చిత్రాన్ని(photo) పంచుకుంటూ వెల్లడించారు.
దీంతోపాటు జనవరి 22, 2023న హృతిక్ రోషన్(Hrithik roshan) సోదరి సునైనా రోషన్ 51వ పుట్టినరోజున వేడుకకు కూడా సబా ఆజాద్ హాజరైంది. హృతిక్ తన భార్య సుసానే ఖాన్ కు 2014లో డివోస్ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్ గా ఉంటున్న హృతిక్..బాలీవుడ్ నటి, సింగర్ సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నారు. దీంతో వీరు ఎక్కడికి వెళ్లినా కూడా జంటగానే వెళుతున్నారు.