»Hrithik Roshan Junior Ntr In War 2 Big Treat For Fans
War2:లో హృతిక్-జూనియర్ ఎన్టీఆర్…ఇక మాములుగా ఉండదు
ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ఫ్యాన్స్ కు పెద్ద ట్రీట్ వచ్చేసింది. అది ఎంటంటే వార్ 2(war2)చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik roshan), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కలిసి నటించబోతున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ మేరకు స్పష్టం చేశారు. దీంతో ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని, పక్కా హిట్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు అభిమాలతోపాటు అటు బాలీవుడ్ ఫ్యాన్స్ కు కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే వార్ 2(war2) మూవీ క్రేజీ నటీనటుల కాంబోలో రాబోతుంది. అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik roshan) తోపాటు సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్(Junior NT) కూడా నటించనున్నారు. అయితే హృతిక్ తన సూపర్ గూఢచారి కబీర్ పాత్రలో మళ్లీ నటిస్తున్నారని తెలుస్తుండగా… జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి పాత్రలో నటిస్తారనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. ఇది అధికారికమని వార్ 2లో హృతిక్ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) మారిన క్రమంలోనే ఈ జాక్ పాట్ ఆఫర్ దక్కించుకున్నాడని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో వార్ 2 చిత్రానికి సౌత్ ఇండియాలో కూడా మరింత మార్కెట్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి ఫస్ట్ రోజే 100 కోట్ల కలెక్షన్లు రావడం పక్కా అని ఇంకొంత మంది అంటున్నారు. అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య కీలక యాక్షన్ సీన్స్(action scenes) కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ 2019లో నిర్మించిన హిట్ మూవీ వార్(war)కు సీక్వెల్ తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వార్ 2 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటి సారిగా కలిసి నటించబోతున్నారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రం నుంచి మరికొంత మంది నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ మూవీలో పాత్రల గురించి ఆయా హీరోల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. గతంలో తెరకెక్కించిన వార్ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేయగా..ఆదిత్య చోప్రా నిర్మతగా వ్యవహరించారు.