మళయాళి బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌కు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తక్కువ కాలంలోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసలు అమ్మడి అందానికి, పర్ఫార్మెన్స్కు ఈ పాటికి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో టాప్ ఉండాల్సింది. కానీ అను మాత్రం మీడియం రేంజ్ హీరోలు, సినిమాల దగ్గరే ఆగిపోయింది. ఇందుకు గ్లామర్ షోకు దూరంగా ఉండడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం అనుపమాకు ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ ఏడాది ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజెస్.. ఈ సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా నిఖిల్ ‘కార్తికేయ2’ అనుపమకు పాన్ ఇండియా స్టార్డమ్ తీసుకొచ్చింది. ఇక తాజాగా రిలీజ్ అయిన 18 పేజెస్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. త్వరలోనే ‘బటర్ ఫ్లై’ మూవీ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. దాంతో అనుపమతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కుర్ర హీరోలు. ఈ నేపథ్యంలో.. అమ్మడు పారితోషికం డబుల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ఒక్కో సినిమాకు 60 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోందట. అయితే సక్సెస్ ఫుల్ బ్యూటీగా రన్ అవుతుండడంతో.. రెమ్యూనరేషన్ కోటి ఇరవై లక్షలకు పెంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అనుపమకు క్రేజ్ చూసి.. మేకర్స్ కూడా అంత మొత్తంలో ఇచ్చేందుకు ఓకే అంటున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో.. డీజె టిల్లు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్‌లో నటిస్తోంది.