ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు రాజమౌళి. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. దాంతో ఈ సారి ఆస్కార్ మన సొంతం అంటున్నారు. ఇక హాలీవుడ్ మేకర్స్ అయితే జక్కన్నను హాలీవుడ్‌కి వచ్చేయమంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం టాలీవుడ్ బిగ్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నానని చెబుతున్నాడు. దాంతో రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందే.. భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది యావత్ సినీ ప్రపంచం. అలాంటిది రాజమౌళి ఓ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పడం మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. రంగస్థలం తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫార్మ్ చేసేశారు రాజమౌళి. రీసెంట్గా లోకేష్ కనకరాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్, కమల్‌హాసన్, గౌతమ్‌మీనన్‌లతో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు రాజమౌళి. ఈ సందర్భంగా.. 2023లో తాను అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ఒకటని అన్నాడు. ఈ సినిమాలో ఇంట్రో సీన్ గురించి చరణ్ తనకు చెప్పాడని.. ఆ సీన్ అద్భుతంగా ఉందని, తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపాడు. గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లోను ఇదే విషయాన్ని చెప్పారు రాజమౌళి. దాంతో నెక్ట్స్ ఇయర్ చరణ్, సుక్కు ప్రాజెక్ట్ పక్కా అంటున్నారు. ప్రస్తుతం చరణ్.. శంకర్ సినిమాతో బిజీగా ఉండగా.. సుకుమార్ ‘పుష్ప2’తో బిజీగా ఉన్నాడు. అయితే ఆర్సీ 16 బుచ్చిబాబుతో కమిట్ అయ్యాడు కాబట్టి.. ఆ తర్వాతే చరణ్, సుకుమార్ సినిమా ఉంటుందని చెప్పొచ్చు.