పుష్ఫ సూపర్ హిట్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే పుష్ప2ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు సుకుమార్. పుష్ప క్లోజింగ్ కలెక్షన్స్.. అంటే దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో పుష్ప2ని రూపొందిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ ఇయర్ ఎండింగ్ లేదా.. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో పుష్ప2 రిలీజ్ కానుంది. అయితే ఈ లోపు మరోసారి బన్నీని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు సై అంటున్నారు అల్లు ఫ్యాన్స్. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తోంది. వరుసగా స్టార్ హీరోల హిట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి.. మహేష్ బాబు పోకిరి, ఒక్కడు.. రికార్డు స్థాయిలో రీ రిలీజ్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వంతు వచ్చింది.
బన్నీ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో ‘దేశముదురు’ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయి పదహారు ఏళ్లు పూర్తి అయ్యింది. వచ్చే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా.. ఏప్రిల్ 7న దేశముదురు చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్.. అప్పట్లో కుర్రకారుకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమాతో హన్సిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు.. చక్రి మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మరి మరోసారి బిగ్ స్క్రీన్ పై దేశముదురు ఎలా రచ్చ చేస్తాడో చూడాలి.