ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ టైం నడుస్తోంది. ఓ వైపు సినిమాలతో దుమ్ములేపుతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ విత్ షోతో అంతకుమించి అనేలా ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా ఈ షోలో ప్రభాస్‌తో చేసిన సందడి మామూలుగా లేదు. ఇక మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన.. వీరసింహారెడ్డి జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యూఎస్‌లో ఒక రోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ వేయబోతున్నారు. అయితే.. వీరసింహారెడ్డి ప్రమోషన్లో వెనకపడ్డాడని నందమూరి ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. రీసెంట్గా అల్యుమినియం ఫ్యాక్టరీ సెట్లో మెగాస్టార్ నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్ పెట్టి.. సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఈ వేడుక ఓ మినీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లా సాగింది. దీంతో బాలయ్య ప్రమోషన్స్ పరంగా వెనకబడిపోయామనే ఫీలింగ్‌లో ఉన్నారు. అందుకే.. సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అయ్యారనే కామెంట్స్ వినిపించాయి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ముందు నుంచి.. వీరయ్య, బాలయ్యను ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రతి విషయంలోను లెక్కలు వేసుకుంటు ముందుకు సాగుతున్నారు. అందుకే వీరయ్య తరహాలోనే వీరసింహారెడ్డి ఓస్టార్ హోటల్లో భారీ ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. రేపో మాపో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే జనవరి 6వ రాయలసీమలో ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే ఈవెంట్ విషయంలోను అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.