ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. అయితే పుష్ప2 పై పెరిగిన అంచనాలను అందుకోవడానికి.. కాస్త గట్టిగానే ట్రై చేస్తున్నాడు సుకుమార్. అందుకోసం ఏకంగా 350 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు. అంతేకాదు ఈసారి భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఇన్వాల్వ్ చేయబోతున్నాడు. బాలీవుడ్ నుంచి ఓ బడా హీరోని రంగంలోకి దింపుతున్నాడని.. ఐటెం గాళ్ కూడా అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ కొత్త పాత్రలేంటనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు సుకుమార్. అయినా కూడా ఇప్పుడో న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మరో తెలుగు హీరో నటించబోతున్నాడట. పుష్ప2లో ఓ అతిథి పాత్ర ఉందట. ఆ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సినిమా పై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుందట. ప్రస్తుతం సుకుమార్ ఆ స్టార్ హీరోని పట్టుకునే పనిలో ఉన్నాడట. అతనెవరేనది తెలియకపోయినా.. బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ స్టార్ ఎవరనే ఆసక్తి అందరిలోను మొదలైంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు.. ఆ హీరోని ఆరా తీసే పనిలో ఉన్నారు కాబట్టి.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని చెప్పొచ్చు. మొత్తంగా కొత్త నటీ నటులతో పాటు మరో హీరో గెస్ట్ రోల్.. పుష్ప 2 పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లేదా.. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పుష్ప2 రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.