Allu Arjun : ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీ సిరీస్‌తో నిర్మాణంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.
ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీ సిరీస్‌తో నిర్మాణంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ. అయితే ఈ క్రేజీ కాంబో అలా సెట్ అయిందో లేదో.. సోషల్ మీడియాలో ఎన్నో డౌట్స్ తెరపైకి వచ్చేశాయి. సందీప్ రెడ్డి, బన్నీ మధ్యలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే సురేందర్ రెడ్డితోను ఓ సినిమా ఉంటుందట. అయినా.. ముందే సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రకటించాడు కాబట్టి.. ఏ ప్రాజెక్ట్ ముందు సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఇక మరో డౌట్ ఏంటంటే.. ఈ కథ మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే బన్నీ దగ్గరికొచ్చిందట. ముందుగా సూపర్ స్టార్‌తో సినిమా చేయాలనుకున్నాడట సందీప్. కానీ మహేష్ నో చెప్పారట. అదే కథను ఇప్పుడు అల్లు అర్జున్ ఓకే చేశాడనేది సోషల్ మీడియా టాక్. ఇక అసలైన డౌట్ ఇంకొటి ఉంది.. అసలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా.. లేదా..? ఎందుకంటే గతంలో బన్నీ ఇలాగే కొన్ని అనౌన్స్మెంట్స్ ఇచ్చాడు. కానీ ఆ ప్రాజెక్ట్స్ ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ ప్రాజెక్టే ఇందుకు నిదర్శనమంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఎప్పుడో ఐకాన్ ప్రాజెక్ట్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే బోయపాటితో కూడా సరైనోడు తర్వాత ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత బోయపాటి తన దారి తను చూసుకున్నాడు. ఇక ఇప్పుడు మధ్యలో త్రివిక్రమ్ ఉండగానే.. సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. సందీప్ కూడా ప్రభాస్‌తో స్పిరిట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమాల రిజల్ట్స్ తేడా కొడితే.. బన్నీ సినిమా ఉంటుందా.. అనేది పెద్ద డౌట్. ఇలా సోషల్ మీడియాలో ఈ క్రేజీ కాంబినేషన్ పై ఎన్నో డౌట్స్ వినిపిస్తున్నాయి. మరి బన్నీ ఏం చేస్తాడో చూడాలి.