»Mimicry Artist Ravi Exclusive Interview Vyuham Movie Rgv
Allrounder Ravi: 18 నిమిషాల్లో 100 వాయిస్ చేసిన రికార్డు నాదే ఇంటర్వ్యూ
మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్‌రౌండర్ రవి ఈ స్థాయిలో ఉండడానికి తాను ఎంత కష్టపడ్డాడో, సినిమాల్లో తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవి ప్రేక్షకులతో పంచుకున్నారు.
Mimicry Artist Ravi Exclusive Interview Vyuham Movie RGV
Allrounder Ravi: మిమిక్రీ హరికిషన్ సపోర్ట్‌తో 18 నిమిషాల్లో 100 వాయిస్‌లు చేసి బుక్ ఆఫ్ వండర్ రికార్డులో స్థానం సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆల్ రౌండర్ రవి (allrounder Ravi) తెలిపారు. 7 నిమిషాల్లో అన్ని వాయిస్ ఎలా చేయాలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆర్జీవి(RGV) చేసే చాలా సినిమాల్లో తనకు మాత్రమే ఎందుకు అవకాశం ఇస్తాడు.? అసలు ఆర్జీవీకి తనకు ఉన్న అనుబంధం ఏంటో తెలిపారు. ఆయన కంటే కంటెంట్ ఇష్టం అని పేర్కొన్నారు. తాను దేవుడిని చాలా ఇష్టంగా ప్రార్థిస్తానని చెప్పారు. ఇక మిమిక్రీ ఎప్పటినుంచి నేర్చుకున్నాడో వివరించారు. కేవలం 5 నిమిషాల్లో 50 వాయిస్‌లు చేసి చూపించారు. జబర్ధస్త్‌లో అవకాశం ఎలా వచ్చిందో తన అనుభవాన్ని పంచుకున్నారు. తనకు ఏ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నిజానికి కళాకారుడు ఏ పార్టీలతో అనుబంధం పెట్టుకోవద్దని సూచించారు. ఎదుటివాడిని హర్ట్ చేయకుండా మిమిక్రీ చేయడం తన స్పెషాలిటీ అని వెల్లడించారు. తన పక్కా కమర్షియల్ అని ఎవరి కోసం కాదు కేవలం పేరు డబ్బు కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. ఇక కొత్తగా డబ్బింగ్ చెప్పేవాళ్లకు ఆల్ రౌండర్ రవి కొన్ని సలహాలు ఇచ్చారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.