Kandala Usha Rani: కుట్రలు, కుతంత్రాలతో ఉన్న సీరియల్స్‌నే ఎందుకు ఎక్కువగా చూస్తారు?
టీవీ సీరియల్స్ ఒకప్పటికి ఇప్పటికి ఏ విధంగా మారాయో, అసలు ఈ పరిశ్రమలో ఉన్న కీలమైన సమస్యలు ఏవో, సీరియల్స్‌ను సినిమా మేకింగ్‌లో తీయడం వలన జరిగే నష్టం ఏంటిదో.. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ సీరియల్ రైటర్ కందల ఉషా రాణి తెలిపారు.
Telugu Serial Writer Kandala Usha Rani Exclusive Interview Gupedantha Manasu
Kandala Usha Rani: మేల్ డామినేషన్ ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో తనను చాలా మంది పేరు మార్చుకొని రాయమని అన్నారని, కాని తనకు పేరు మార్చుకోవడం ఇష్టం లేదని అన్నారు ప్రముఖ డైరెక్టర్ మంజుల నాయుడు. రాఘవేంద్రరావు(Raghavendra Rao) తమని చాలా ప్రోత్సహించారన్నారు. అయితే తాను రాసే డైలాగ్స్ డెప్త్‌గా ఉండడం మూలంగా చాలా సందర్భాల్లో డైలాగులు రాయడం మానేసినట్లు చెప్పారు. మంగమ్మగారి మనవరాలు(Mangamma Gari manuvaralu), పున్నాగా(Punnaga) లాంటి సీరియల్స్ చాలా మంచి పేరు తెచ్చాయి అన్నారు. రాఘవేంద్ర రావు చాలా మంచి వారని, ప్రోత్సాహం ఇవ్వడంలో ఆయనను మించిన వారు ఇంకొకరు ఉండరు అని చెప్పారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నట్లు వివరించారు. ఆయన ఎప్పుడు ఆడియన్స్‌ను డివైడ్ చేయడని, క్లాస్, మాస్ అని తేడా ఉండదు. అందరికి అర్థం అయ్యేలా చెప్తున్నామా లేదా అని మాత్రమే చూస్తారు అని తెలిపారు.
ప్రతి ఛానెళ్లో క్రియేటీవ్ హెడ్స్ ఉంటారు. వాళ్లను ఒప్పించడం కొంత కష్టం. కాని మన సబ్జెక్ట్ బాగుంటే ఛానెల్ వాల్లు ఇన్వాల్వ్ అవరు అని వెల్లడించారు. అయితే అప్పటికి, ఇప్పటికి సిరియల్స్ ఏం మారిందో చాలా చక్కగా వివరించారు. టీఆర్పీ అనేది క్రియేటీవ్ థాట్‌ను కిల్ చేస్తుందని ఓ షాకింగ్ విషయం చెప్పారు. అలాగే చాలా మంది ఈ సీరియల్ ఇండస్ట్రీలో తనను నెగిటీవ్‌గా ప్రొజెక్ట్ చేస్తుంటారని కాని తనకు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తానే కొన్ని సీరియల్స్ నుంచి తప్పుకోవడం జరిగిందని చెప్పారు. ఇప్పటి పరిస్థితిల్లో సీరియల్స్ నడిపించడం చాలా కష్టం. సినిమా తరహా మేకింగ్ ఈ పరిశ్రమలో వచ్చినప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది. అయితే యూట్యూబ్ కామెంట్స్ వచ్చే వాటిని బట్టి వాళ్ల సైకాలజీ తెలుస్తుందని చెప్పారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, టీవీ సీరియల్స్‌లో జరిగే ఎన్నో షాకింగ్ విషయాల గురించి చెప్పారు. మరి ఈ సీరియల్ ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.