»Actress Annie Exclusive Interview Looser Rajanna Rangasthalam Prabhas Hit Tv Telugu
Actress Annie: బిగ్ బాస్ 7 నుంచి కాల్ వచ్చింది..కానీ
బేబీ యాని టాలీవుడ్లోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. 2011లో రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్ర చేసి ఎంతో మంచి పేరు పొందింది. ఆ సినిమాకు ఆమెకు నంది అవార్డు కూడా లభించింది. హిట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలను, సినిమా కెరీర్ లోని ముఖ్య ఘట్టాలను పంచుకుంది.
బేబీ యాని రాజన్న సినిమాలో చేసిన పాత్రకు నంది అవార్డును అందుకుంది. అంతకుముందు జగపతి బాబు, ఛార్మీలతో కలిసి అనుకోకుండా ఒక రోజు సినిమా చేసింది. 2005లో ఆ సినిమాతో ఆమె తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత స్టాలిన్, అతిథి, స్వాగం, ఏక్ నిరంజన్ వంటి సినిమాల్లో నటించింది.
2020లో వచ్చిన జీ5 తెలుగు వెబ్ సిరీస్ లూజర్ లో ప్రియదర్శి, కల్పిక గణేష్ లతో కలసి యాని నటించింది. ఇటీవలె విడుదలై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న బేబీ మూవీలో నటించే ఛాన్స్ యానికి వచ్చింది. అయితే ఆ చిత్రానికి చివరికి వైష్ణవి చైతన్య నటించాల్సి వచ్చినట్లు యాని తెలిపింది. త్వరలో ప్రారంభమయ్యే బిగ్ బాస్7కి కూడా యానిని రమ్మంటూ కాల్ వచ్చిందని, అయితే తనకు ఇష్టంలేకే వెళ్లలేదని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు హిట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.