TG: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి వైభవంగా షురూ కానున్నాయి. ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్మాపూర్కు సమీపంలో ఉంటుంది. పేదల తిరుపతిగా ఈ క్షేత్రానికి ప్రసిద్ధి. ఈ బ్రహ్మోత్సవాల్లో వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.