మేషం
ఆర్థికంగా బలపడతారు. ఏ పని ప్రారంభించినా అనుకున్న ఫలితాలు వస్తాయి. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి.
వృషభం
కుటుంబ సభ్యులను ప్రేమ భావంతో చూడటం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి.వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు.
మిథునం
మీరు ప్రారంభించబోయే పనుల్లో మీ ప్రయత్నబలాన్నిపెంచాలి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
కర్కాటకం
సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. మీరు ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుంతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
సింహం
ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య
మీదైన రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధపనికిరాదు.
తుల
మీరు అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.మీరు అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు.
వృశ్చికం
మీరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ,ప్రయాణాల్లో జాగ్రత్త. అప్పులు ఇబ్బంది పెడతాయి.
ధనుస్సు
శుభవార్తలు వింటారు. ఇది శుభకాలం. మంచి ఆలోచనలు వస్తాయి. ధర్మకార్యాలు చేయడంపై ఆసక్తి పెరుగుతుంది. దైవర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి.
మకరం
కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కుంభం
శుభ కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. మీరు సంపూర్ణ మనోబలంతో విజయం సాధిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
మీనం
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.