మేషం:
ఈ రాశి వారికి రోజంతా బావుంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచుతారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. దైవకార్యాల్లో పాల్గొని పూజలు చేస్తారు. కులదైవాన్ని పూజించండి.
వృషభం:
వీరికి అనేక విధాలుగా మంచి కలుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవ్వడం సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఇతరులకు ఆర్థికంగా సాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటను గౌరవిస్తారు. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శాంతంగా ఉండండి.
మిథునం:
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. సతీమణితో అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు తలెత్తవు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటకం:
ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయకుండా వదిలేస్తారు. మీకు అవసరమైనప్పుడు ఎవ్వరూ సాయం చేయలేరు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో చికాకులు ఉంటాయి.
సింహం:
ఆర్థిక పరిస్థితులు బావుంటాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సాయం కోరుతారు. వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలను అందిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.
కన్య:
ఈ రాశివారికి కొద్దిపాటి సమస్యలు, ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. మొండి బాకీలను వసూలు చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉండండి.
తుల:
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యతగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం:
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో టెన్షన్ ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరంగా ఒత్తిడి ఎక్కువవుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు.
ధనుస్సు:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి జరుగుతుంది. విదేశాల నుంచి ఉద్యోగాలపరంగా ముఖ్య సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ స్నేహితులతో కలిసి పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకరం:
ఆదాయం, ఆరోగ్యం బావుంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలుగుతాయి. బంధువులతో చిన్న చిన్న గొడవలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కుటుంబంలో అందరితో సంతోషంగా మెలుగుతారు.
కుంభం:
కొన్ని కీలక విషయాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా మారుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల బాధ్యతలను పంచుకుంటారు. కొందరు బంధువులు, సన్నిహితులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది.
మీనం:
ఇంటా బయటా మాటకు, చేతకు అందరూ విలువనిస్తారు. ఉద్యోగాల్లో అధికారుల అండదండలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా మంచి గుర్తింపు పొందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.