మేషం:
అనుకూల పరిస్థితులు ఉంటాయి. శని, శుక్రుల బలం బావుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిలకడ అవసరం. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అవసరానికి మించి ఇతరులకు సాయం చేస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి.
వృషభం:
శుభవార్తలు వింటారు. శుక్ర, బుధ, రవుల సంచారం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి. దీర్ఘకాలిక రుణ భారం తగ్గుతుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం:
వ్యక్తిగత సమస్యలు తొలగుతాయి. రుణ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు బావుంటాయి. బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా సాగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
కర్కాటకం:
ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెట్టవు. ఆర్థికంగా పురోగతి పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు బావుంటాయి. ఉద్యోగంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. సంతానానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
సింహం:
ఆకస్మిక ధన లాభం పొందుతారు. అదనపు ఆదాయ మార్గాల వల్ల లాభాలు వస్తాయి. సొంత పనులకు ప్రాధాన్యత ఇవ్వరు. ఇతరుల బాధ్యతలు మీ మీద పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత పనుల్లో స్నేహితుల సాయం తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు వస్తాయి.
కన్య:
అనేక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉండవు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇబ్బంది పడతారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉండదు. ఆదాయం నిలకడగా ఉండదు. మొండి బాకీలు, బకాయిలు వసూలు చేయాలనుకుంటారు.
తుల:
మీ మాటకు, చేతకు ఎదురుండదని గర్వపడటం మంచిది కాదు. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఉద్యోగంలో ఇతరులకు సలహాలు ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రావలసిన డబ్బు సకాలంలో అందదు. అనుకోని ఖర్చులు చేస్తారు. మిత్రుల వల్ల డబ్బులు నష్టపోతారు.
వృశ్చికం:
ఆదాయానికి, ఆరోగ్యానికి ఏ సమస్యా ఉండదు. ఆదాయం కొద్దో గొప్పో పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో దైవ దర్శనాలు చేస్తారు. వ్యాపారప్రయత్నాలు బావుండవు. మిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. వినాయకుడి ఆలయాన్ని దర్శించుకోండి.
ధనుస్సు:
మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నిలకడగా ఉండాలి. పిల్లల పరంగా గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించండి. సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకోండి.
మకరం:
ఆర్థిక పరిస్థితి అంతగా బావుండదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సతీమణి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి జరుగుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం మందకోడిగా ఉంటుంది.
కుంభం:
స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసలు తప్పవు. వృత్తి, వ్యాపారాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. ఉద్యోగ జీవితం బావుంటుంది. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలను సంతృప్తిగా ఉంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. వెంకటేశ్వరస్వామికి పూజ చేయండి.
మీనం:
జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బావుంటాయి. ఆర్థికంగా ఇతరులకు సాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా చేస్తారు. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరిగి ఆనందంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు వస్తాయి.