»Horoscope Today Todays Horoscope November 26th 2023 Will Hear Good News
Horoscope Today : నేటి రాశిఫలాలు(November 26th 2023)..శుభవార్తలు వింటారు
ఈ రోజు(November 26th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
ఈ రాశివారికి గ్రహబలం బాగుంది. అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది. ఆదాయం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. విలాసాలకు దూరంగా ఉంటే మంచిది. భార్య పట్ల ప్రేమను చూపుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. శుభవార్తలు వింటారు.
వృషభం :
ఈ రాశివారికి జీవితం కాస్త ఒత్తిడిగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో ఏ ఇబ్బంది ఉండదు. కుటుంబంలో చికాకులు ఉంటాయి. బంధువుల నుంచి అపనిందలు మోయాల్సి వస్తుంది. స్నేహితులు ఆర్థికంగా ఆదుకుంటారు. దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది.
మిథునం:
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి. అన్ని ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు శుభవార్త వింటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కర్కాటకం:
ఈ రాశివారికి గ్రహ బలం బావుంటుంది. ఉద్యోగార్థులు కొత్త ప్రయత్నాలు మొదలు పెడుతారు. ఒత్తిడి అనేది ఉంటుంది. కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఒత్తిడి ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి.
సింహం :
ఈ రాశివారికి శని ప్రభావం ఉంది. అన్నిచోట్లా ఒత్తిడి అనేది ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతారు. మొండి వ్యాధులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
కన్య :
ఈ రాశివారికి అన్నింట్లోనూ మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అన్ని ప్రయత్నాలలో ఇబ్బంది కలుగుతుంది. వ్యక్తిగత సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆదాయం పర్వాలేదు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీరిక లేకుండా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు చేపడుతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. వాగ్దాలు చేయకుండా ఉంటే మంచిది.
తుల:
ఈ రాశివారికి శుభవార్తలు అందుతాయి. అన్నింట్లోనూ శుభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత జీవితం బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చికం:
ఈ రాశివారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. చేపట్టే అన్ని పనులు ప్రశాంతంగా సాగుతాయి. ప్రశాంతంగా ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఇబ్బంది ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగం సాఫీగా సాగుతుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు బావుంటాయి. విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయి.
ధనుస్సు:
ఈ రాశివారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగుల్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థిక వ్యవహారాలు బావుంటాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆదాయం బావుంటుంది. చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఆలయాలను దర్శిస్తారు.
మకరం:
ఈ రాశివారికి గ్రహాలు బావుండటం వల్ల చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం బావుంటుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. బంధువులతో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారం బావుంటుంది. డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కుంభం:
ఈ రాశివారికి ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. సహనంగా ఉంటే మంచిది. వ్యాపారాలు బావుంటాయి. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కష్టాలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది.
మీనం:
ఈ రాశివారికి ఏలినాటి శని ఉండటంతో ఇబ్బందులు తప్పవు. ఆర్థిక సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. అదనపు బాధ్యతల వల్ల ఇబ్బందులు పడతారు. శుభవార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలు బావుండవు. సమస్యలు చుట్టుముట్టినా జాగ్రత్తగా, సహనంగా ఉండండి.