Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 8th)..ఆకస్మిక ధనలాభం ఉంది.
ఈ రోజు(2024 June 8th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
కొత్త వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మొదలు పెట్టిన పనులు వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. అప్పు బాధలు తొలగిపోతాయి.
వృషభం
మీమీ రంగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులు చేయరాదు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేకత ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో కొత్త పనులు ప్రారంభిస్తారు.
మిథునం
గృహంలో జరిగే మార్పులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించకపోవడం మేలు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం
సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. శుభకార్యప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంది.
సింహం
తప్పుదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారు మానసికంగా ఆందోళన చెందుతారు. ఆకస్మిక ధననష్టం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు వాయిదావేసుకోవడం మంచిది.
కన్య
కోపాన్ని తగ్గించుకోవాలి. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకు కదలాలి. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
తుల
విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబ కలహాలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ధనలాభం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు.
ధనుస్సు
పిల్లలవలన ఇబ్బందులు ఉన్నాయి. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు పోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
మకరం
అనుకోని ధనలాభం ఉంది. కొత్త వస్తు, ఆభరణాలను పొందుతారు. సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.
కుంభం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన ఉంది. అనారోగ్య బాధలు ఉన్నాయి. నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతారు.
మీనం
సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంది.