»Horoscope Today Todays Horoscope 2024 January 25th
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 25th)
ఈ రోజు(2024 January 25th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
కీలక సమస్యలకు పరిష్కారం అవుతాయి. మీ చుట్టు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు విషయంలో జాగ్రత్త వహించాలి. సూర్యఆరాధన చేయడం మంచిది.
వృషభం
మొదలు పెట్టిన పనులకు కొన్ని ఆటంకాలు వస్తాయి. అధికారులు మీ పనిలో తృప్తి చెందరు. బంధు, మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆలోచించండ, లేదంటే కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఒక సంఘటన మిమ్మల్ని బాధిస్తుంది. ఇష్ట దైవారాధన మంచిది.
మిథునం
మనోబలం మీ పనులను పూర్తి చేయడంలో తోడ్పడుతుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్త పడాలి. వృథా ప్రయాణాలు మానుకోండి. సమయానికి నిద్రాహారాలు మరవద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శించుకోండి.
కర్కాటకం
ఏ పనినైనా ఇష్టపడి చేయండి. ఆలోచించి ఆడుగేయాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు పడుతారు. అవసరానికి సహాయం అందుతుంది. శ్రీఆంజనేయ ఆరాధన మరవద్దు.
సింహం
దైవబలం అండగా ఉంటుంది. నలుగురిలో కీర్తిప్రతిష్టలు గడిస్తారు. అధికారుల అండ ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈశ్వరుడిని స్మరించడం ఉత్తమం.
కన్య
మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుంది. శ్రమ పెరగుతుంది. ఒక విషయం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. శత్రువలతో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మంచిది.
తుల
మొదలు పెట్టిన పనునల్లో సాయం అందుతుంది. సన్నిహితులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవవాలి. అప్పులు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని పూజించండి.
వృశ్చికం
అనుకున్న ఫలితం రాదు. పనిలో శ్రమ పెరుగుతుంది. బంధువులు మీ మనసును నొప్పిస్తారు. పనిభారం పెరుగుతుంది. పై అధికారులు మీ పనిపట్ల సంతృప్తి చెందరు. అనుకోని ప్రయాణాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. శ్రీహరిని పూజించడం మానవద్దు.
ధనస్సు
మీ ప్రతిభ, పనితీరుకు అందరు మెచ్చుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో మంచి ఫలితం దక్కుతుంది. ఇష్టదైవారాధన మంచిది.
మకరం
మీ తెలివితో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి పేరును తీసుకొస్తాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉండండి. శ్రీలలితా సహస్రనామ పారాయణ మరవద్దు.
కుంభం
మీరు చేసే పనుల్లో విజయం సాధించాలంటే మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. గణపతి స్తోత్రం చదవడం మంచిది.
మీనం
శ్రమ పెరుగుతుంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం లభిస్తుంది. బంధు, మిత్రులను కలుస్తారు. అప్పు పుడుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.