మేషం
పనులు సజావుగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో ఇంట్లో సందడి నెలకొంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం
బంధు మిత్రులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. కళాకారులకు అవకాశాలు వస్తాయి. స్థిరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించండి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలు చదివి, దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మిథునం
విద్యార్థులకు మంచి సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అధికారులతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
ప్రయాణాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహోద్యోగుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. శివాలయాన్ని సందర్శించండి.
సింహం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్త వింటారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
కన్య
జీవిత భాగస్వామితో కొన్ని విషయాలలో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట చికాకులు తప్పవు. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వల్ల శుభం కలుగుతుంది.
తుల
ఈ రోజు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణలు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.
వృశ్చికం
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు. నిరుద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. గోమాతకు గ్రాసం పెట్టడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు
ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసిరావు. మిత్రులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో చర్చలు కలసిరావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.
మకరం
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు. గృహమున సంతాన శుభకార్యాలు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభలా బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి.
కుంభం
వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతను పూజించండి.
మీనం
ఈ రోజు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగుల్లో అధికారుల నుంచి అనుకూలత పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం సూర్య దేవుని ఆరాధన చేయండి.