»Alert To Devotees Of Tirumala Srivari Temple Will Be Closed On 28th
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్..28న ఆలయం మూసివేత
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్టోబర్ 28వ తేది మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఆలయాన్ని మూసివేస్తున్నామని, దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 28వ తేదిన తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని (Tirumala SriVenkateswara Temple) మూసివేయనున్నట్లు టీటీడీ (TTD) వెల్లడించింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు (Temple Closed) తెలిపింది. 29వ తేది వేకువ జామున 1.05 గంటల నుంచి తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోందని పేర్కొంది. ఈ తరుణంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది.
సాధారణంగా గ్రహణ సమయానికి (Lunar Eclipse) ఆరు గంటలు ముందుగానే ద్వారా మూసివేయడం (Temple Closed) ఆనవాయితీగా వస్తోంది. గ్రహణం పూర్తి అయిన తర్వాత తెల్లవారు జామున 3.15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారాలను తెరవనున్నారు.
చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) తెలిపింది. గ్రహణం కారణంగా సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని అక్టోబర్ 28న రద్దు చేసినట్లుగా టీటీడీ (TTD) వెల్లడించింది.