రాజస్థాన్‌లోని మేవాత్ ప్రాంతం ఆన్లైన్ మోసగాళ్లకు పెద్ద కేంద్రంగా మారింది. దీగ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో పోలీసులు జరిపిన దాడిలో ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆన్లైన్ మోసగాళ్లు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఇంట్లో ఏటీఎం మెషీన్లను అమర్చారు.
Cyber Crime: రాజస్థాన్‌లోని మేవాత్ ప్రాంతం ఆన్లైన్ మోసగాళ్లకు పెద్ద కేంద్రంగా మారింది. దీగ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో పోలీసులు జరిపిన దాడిలో ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆన్లైన్ మోసగాళ్లు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఇంట్లో ఏటీఎం మెషీన్లను అమర్చారు. జుర్హరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సబల్‌గఢ్, బమ్ని అనే రెండు గ్రామాలపై పోలీసులు శనివారం దాడి చేశారు. మోసగాళ్ల ఇళ్లలో ఏటీఎం మిషన్లు అమర్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 4 ఏటీఎం మిషన్లు, 10 ఏటీఎం కార్డులు, 5 పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు, 4 నోట్లు లెక్కించే యంత్రాలు, 2 ల్యాప్‌టాప్‌లు, 8 చెక్ బుక్‌లు, 3 బ్యాంకు పాస్‌బుక్‌లు, రూ.2,94,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడికి ముందే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు 5 కేసులు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలను మోసం చేసేవారు. నగదు విత్‌డ్రా చేయడానికి ఇంట్లోనే ATM మెషీన్లను అమర్చారు.
దుండగులు అక్రమంగా ఏటీఎం మిషన్లు అమర్చి మోసానికి పాల్పడుతున్నారని డీగ్ ఎస్పీ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ్ తెలిపారు. వివిధ చోట్ల జరిపిన దాడుల్లో 4 అక్రమ ఏటీఎం మిషన్లను స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. పీఎంవో పేరిట మోసం కేసు నమోదైన సందర్భంగా అక్టోబర్ 27న ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కూడా ఇక్కడికి చేరుకుంది. పీఎంవోలో అసిస్టెంట్ కమాండెంట్‌గా నటిస్తూ మోసగాడు తన నుంచి రూ.5వేలు తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. మేవాత్ ప్రాంతంలో చాలా మంది దుండగులు నిరక్షరాస్యులు, కానీ 15 రాష్ట్రాల్లో వారు బాగా చదువుకున్న వారిని కూడా లక్షలు, కోట్లలో మోసం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 13 నుంచి 60 ఏళ్ల లోపు వారే.