Police Ride: అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న పబ్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో ఆఫ్టర్ నైన్ పబ్‌పై పోలీసులు రెయిడ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్‌లో అసభ్య నృత్యాలు చేస్తున్నారని, డ్యాన్సర్లతో పాటు పబ్‌కు వచ్చిన యువతీయువకులను శనివారం రాత్రి బంజారహిల్స్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. గత రాత్రినే పబ్‌ను మూసి వేశారు. సహజంగానే హైదరాబాద్‌లో పబ్ కల్చర్ పెరుగుతోంది. వీకెండ్స్‌లో మరీ ఎక్కువగా సాగుతోంది. వస్తున్న కస్టమర్లను ఆకర్షించేలా నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.
ఓవర్ టైమ్ వరకు పబ్స్ రన్ చేయడం.. అసభ్యకరమైన చర్యలకు సైతం పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. కొన్ని మాత్రం నిబంధనలను లెక్క చేయకుండా.. అనుమతులు సైతం తీసుకోకుండా నడిపిస్తున్నారు. దీంతో పోలీసులు అలాంటి పబ్‌లపై రైడ్ చేశారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌లోని ఆఫ్టర్ నైన్ క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. 35 మంది యువతి డ్యాన్సర్లతో పాటు పార్టీకి వచ్చిన మొత్తం 167 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.