• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ఓయోలో డ్రగ్స్ పార్టీ.. పట్టుబడ్డ కొరియోగ్రాఫర్

TG: హైదరాబాద్, మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలంరేగింది. ఓయోలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దాడుల్లో కొరియోగ్రాఫర్ కన్హ మహంతి, ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి పట్టుబడ్డారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నాడు. పార్టీలో ఎండీఎంఏతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

December 2, 2024 / 08:58 AM IST

విద్యుత్ షాక్ కు గురైన యువకుడు మృతి

ATP: కూడేరు మండలం చోళసముద్రానికి చెందిన చిట్రా శివ ప్రైవేట్ విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత నెల 2న ఓ రైతు పొలంలో మరమ్మతుల కోసం వెళ్లిన ఆయన షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించక ఆదివారం మృతిచెందాడు. శివకు భార్య ఆశ, కుమార్తె ఉన్నారు.

December 2, 2024 / 08:50 AM IST

రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీ అటెండర్ మృతి

MBNR: జడ్చర్లలోని 44వ జాతీయ రహదారిపై కృష్ణయ్య అనే వ్యక్తి ఆదివారం రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. జడ్చర్ల మున్సిపాలిటీలో అటెండర్‌గా పని చేసేవాడని స్థానికులు అన్నారు. కృష్ణయ్య మృతి చెందడం బాధాకరమని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు.

December 2, 2024 / 08:40 AM IST

స్టేడియంలో ఘర్షణ.. 100 మంది మృతి

పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో 100 మంది మృతి చెందారు. మ్యాచ్‌ జరుగుతుండగా రెండు వర్గాల అభిమానుల మధ్య చోటు చేసుకున్న విపరీతమైన గొడవలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడ్డాయి.

December 2, 2024 / 08:34 AM IST

బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలు

KMM: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన ఆదివారం రాత్రి నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోటాపురం గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడడంతో బైక్‌పై ఉన్న తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వెంకటేశ్వర్లుని స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

December 2, 2024 / 08:08 AM IST

కృష్ణా నది వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం

NRPT: జిల్లాలోని కర్ణాటక సరిహద్దు కృష్ణానది వంతెనపై ఈరోజు సోమవారం తేల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయిచూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతిచెందారు. బస్సు కిందికి దూసుకుపోగా అందులోని మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

December 2, 2024 / 08:02 AM IST

కొప్పరం గ్రామంలో విషాదఛాయలు

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునీర్ బాషా తన భార్య గర్భవతి కావడంతో ఆమెను చిలకలూరిపేటలోని హాస్పిటల్‌లో చూపించుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా వేమవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఖాన్సా 13 నెలలు పాప అక్కడికక్కడే మృతి చెందింది.

December 2, 2024 / 07:48 AM IST

మచిలీపట్నం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులో పశువులను ఢీకొట్టిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గొల్లగాని సత్యనారాయణ (35) స్థానిక మూడు స్థంభాల సెంటర్ సమీపంలో వెండి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా బైపాస్ రోడ్డులో డివైడర్ పక్కన పడుకుని ఉన్న పశువులను ఢీకొట్టాడు.

December 2, 2024 / 07:20 AM IST

చనిపోయిన వారి పేరుతో సైబర్ వల

AP: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ కొత్త మార్గాల్లో మోసం చేయడం సహజమైపోయింది. తాజాగా కడప జిల్లా కేంద్రంలోని అంగడివీధికి చెందిన ఓ వ్యక్తి తల్లి చనిపోయింది. అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ సదరు వ్యక్తి కి ఫోన్ చేసిన కేటుగాడు ‘ మీ అమ్మ పాలసీకి సంబంధించి చివరి కిస్తీ కట్టలేదు. రూ. 5వేలు కడితే రూ. 5లక్షలు వస్తాయి, ఫోన్‌పే చేయండి’అని మాట్లాడాడు. దీంతో పాలసీ తాలూక వివరాలు అడగడంతో ఫ...

December 2, 2024 / 07:14 AM IST

లారీ ఢీకొని యువ రైతు దుర్మరణం

MBNR: మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ రైతు దుర్మరణం చెందాడు. మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన కుమార్ (24) స్పింక్లర్ పైపులు తీసుకొని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 2, 2024 / 05:38 AM IST

చామనపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

KNR: చామనపల్లి క్రాసింగ్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి నుంచి నగునూరు వైపు టీవీఎస్‌పై వస్తున్న వ్యక్తిని నగునూరు నుంచి దుబ్బపల్లి వైపు వెళ్తున్న బైకర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో నగునూరుకి చెందిన లక్ష్మీ నరసింహచారి(65) తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ వ్యక్తిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

December 2, 2024 / 05:30 AM IST

15 మంది జూదరులు అరెస్ట్

SKLM: రణస్థలం మండలంలోని చిన్న పిషిణి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 15 మందిని జె.ఆర్.పురం పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.33,480 నగదు, 15 సెల్ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. SI ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

December 2, 2024 / 04:36 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కేసు నమోదు

SRCL: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై గణేశ్ తెలిపారు. చేపూరి కైలాసం(60) ఆదివారం ఉదయం 8 గంటలకు తన ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇటుక ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన కైలాసం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

December 2, 2024 / 04:23 AM IST

10 మద్యం బాటిళ్లు సీజ్

ELR: లింగంపాలెం మండలం కే. గోకవరం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 మద్యం బాటిళ్లను సీజ్ చేశామని సీఐ అశోక్ తెలిపారు. చింతలపూడి సర్కిల్ పరిధిలో నాటు సారా తయారీ, అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 2, 2024 / 04:13 AM IST

బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్టు

W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం గ్రామంలో దాడి చేసి తట్టవర్తి మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఎనిమిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎస్ఐ బి.లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

December 2, 2024 / 04:05 AM IST