కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులో పశువులను ఢీకొట్టిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గొల్లగాని సత్యనారాయణ (35) స్థానిక మూడు స్థంభాల సెంటర్ సమీపంలో వెండి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని తన బైక్పై ఇంటికి వెళుతుండగా బైపాస్ రోడ్డులో డివైడర్ పక్కన పడుకుని ఉన్న పశువులను ఢీకొట్టాడు.