• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

అదుపు తప్పి ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

NRML: అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటన సౌంల్లి గ్రామం వద్ద సోమవారం చోటు చేసుకొంది. భైంసా నుండి సౌంల్లి గ్రామానికి సిమెంట్ లోడ్‌తో వస్తున్న క్రమంలో ఆటో బోల్తా పడి డ్రైవర్ కే.గంగాధర్(33) అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 8, 2025 / 06:49 PM IST

ఉరేసుకుని యువకుడు మృతి

మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్ గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. తల్లి రోజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 8, 2025 / 06:34 PM IST

మున్నేరులో యువకుల గల్లంతు.. ఒకరి మృతి

కృష్ణా: కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కోసం మున్నేరుకు వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు సోమవారం గల్లంతయ్యారు. వీరిలో కుద్దుస్ మృతదేహం లభ్యం కాగా, ఫారూక్ అనే మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

September 8, 2025 / 06:13 PM IST

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లా గుడ్డార్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి.

September 8, 2025 / 05:02 PM IST

BREAKING: కాల్పులు.. 14 మంది మృతి

నేపాల్‌లో ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియా నిషేధంపై రాజధాని ఖాట్మండులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా.. 100 మంది పైగా గాయపడ్డారు. ఖాట్మండుతో పాటు 10 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది.

September 8, 2025 / 04:05 PM IST

గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యాయత్నం

W.G: భీమవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల ఫుట్ పాత్ వంతెన మీద నుంచి గుర్తుతెలియని మహిళ యనమదుర్రు మురుగు కాలవలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 8, 2025 / 03:50 PM IST

గుర్తు తెలియని మృతదేహం కలకలం

W.G: ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగిన మృతదేహం గ్రామ శివారులోని వరి చేలల్లో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు ఎస్సై జానా సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 8, 2025 / 03:34 PM IST

విషాదం: AC పేలి ముగ్గురు మృతి

హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో సచిన్ కపూర్, అతని భార్య రింకూ కపూర్, వారి కుమార్తె సుజన్ మృతిచెందారు. కిటికీలో నుంచి బయటకు దూకి సచిన్ కుమారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే, సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

September 8, 2025 / 03:14 PM IST

ఉగ్రదాడి.. ఐదుగురి మృతి

జెరూసలెం శివారులోని ఓ రద్దీ బస్టాప్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురి మృతి చెందారు. మరో 15 మందికి గాయాలైనట్లు ఇజ్రాయెల్ పోలీసులు వెల్లడించారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. గాజాతో యుద్ధం వేళ ఈ ఘటన కలకలం రేపింది.

September 8, 2025 / 02:49 PM IST

రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు

GDWL: గుంతకల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు నుంచి ఈరోజు మానవపాడు రైల్వే స్టేషన్ సమీపంలో తాటికుంటకి చెందిన జీవరాజ్ (25) అనే యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ మేరకు అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఈఎంటీ రేణుక, పైలెట్ దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.

September 8, 2025 / 02:13 PM IST

ట్రాక్టర్ బోల్తా .. ఇద్దరికీ తీవ్ర గాయాలు

NLR: వరికుంటపాడు మండలం భోగ్యం వారి పల్లె వద్ద 565 జాతీయ రహదారిపై సోమవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ సహాయంతో పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

September 8, 2025 / 12:50 PM IST

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి ఒంగోలుకు వస్తున్న ఆర్టీసీ బస్సును గ్రానైట్ లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

September 8, 2025 / 11:52 AM IST

ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. గుడార్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు మోహరించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు కాల్పులు జరుపుకోగా, ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారితో పాటు ఓ జవాన్ కూడా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 8, 2025 / 11:10 AM IST

నేషనల్ హైవేపై కంటైనర్‌లో చెలరేగిన మంటలు

NZB: ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడంతో  విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కంటైనర్‌ హైదరాబాద్ నుంచి నాగపుర్‌కు పార్సిల్స్‌ తీసుకెళ్తున్న సమాయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

September 8, 2025 / 10:50 AM IST

విశాఖ‌లో మృత‌దేహం క‌ల‌క‌లం

VSP: విశాఖపట్నం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం నీలమ్మ వేపచెట్టు ప్రాంతానికి చెందిన బొంత అప్పలరాజు (55) అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమ‌వారం ఉద‌య స్థానికులు మృత‌దేహాన్ని క‌నుగొన్నారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 8, 2025 / 09:32 AM IST