పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో 100 మంది మృతి చెందారు. మ్యాచ్ జరుగుతుండగా రెండు వర్గాల అభిమానుల మధ్య చోటు చేసుకున్న విపరీతమైన గొడవలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడ్డాయి.