KNR: చామనపల్లి క్రాసింగ్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి నుంచి నగునూరు వైపు టీవీఎస్పై వస్తున్న వ్యక్తిని నగునూరు నుంచి దుబ్బపల్లి వైపు వెళ్తున్న బైకర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో నగునూరుకి చెందిన లక్ష్మీ నరసింహచారి(65) తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ వ్యక్తిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.