KMM: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన ఆదివారం రాత్రి నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోటాపురం గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడడంతో బైక్పై ఉన్న తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వెంకటేశ్వర్లుని స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు.