PLD: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెట్లూరివారిపాలెం నుంచి కోటప్పకొండ వైపు బైక్‌పై వస్తున్న బాలుడు ఓ మలుపు వద్ద ప్రమాదవశాత్తు లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిచెందిన బాలుడు పెట్లూరివారిపాలెం చెందిన రామారావు కుమారుడు కమల్(14)గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
KRNL: తెలంగాణ షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు ఇద్దరు మృతి చెందారు. రెడ్డిపాలెంలో పత్తి తీసేందుకు కర్నూలు నుంచి వలస కూలీలు శుక్రవారం రాత్రి ట్రైన్లో తిమ్మాపూర్‌కు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి ఓ ట్రాక్టర్లో వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సోమమ్మ(55), మమత(5) అక్కడికక్కడే మృతిచెందారు.
TG: బిజినెస్ పేర మోసాలకు పాల్పుడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన కాంతిదత్ జూబ్లీహిల్స్‌లో సస్టెయిన్ కార్ట్ పేరుతో స్టోర్ ప్రారంభించి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు. తరువాత తృతీయ పేరుతో జ్యూలరీ షాప్ ప్రారంభించి పరిణితి చోప్రాతో ప్రాచారం చేశాడు. పరిణితికి ఇవ్వాలంటూ శ్రీజా రెడ్డి అనే మహిళను నమ్మించి రూ.1.5కోట్లు తీసుకున్నాడు. అలాగే నకిలీ పత్రాలతో ఎస్బీఐలో దాదాపు ...
W.G: బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
AP: మూడు రోజుల క్రితం సత్యసాయి జిల్లాలోని ఆముదాలగొంది ఉన్నత పాఠశాలలో అపహరణకు గురైన చేతన్‌ను వరుసకు మామ అయ్యే అశోక్ అనే వ్యక్తే హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తాతకు నిందితుడు చేసిన ఫోన్‌కాలే అతన్ని పట్టించింది. బాలుడి తాత శ్రీరామప్పకు అశోక్ నాగమణి అనే మహిళ ఫోన్ ద్వారా కాల్ చేసి కిడ్నాప్ చేస్తామని చెప్పాడు. ఫోన్ కాల్ ఆధారంగా అతన్ని, నాగమణి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.
TG: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌లో వచ్చిన కారు బైక్, ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. దాన్ని ఉల్లంఘిస్తూ డ్రోన్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇరాక్ వైపు నుంచి రెండు డ్రోన్లు తమ దేశంలోకి దూసుకొచ్చాయని, వాటిని కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. వాటిని ఇరాక్ ప్రయోగించిందని చెప్పడానికి గుర్తు అవి తూర్పు వైపు నుంచి రావడమేనని తెలిపింది. మధ్యధరా సముద్రంలోని నావికాదళం పడవ సాయంతో వాటిని కూల్చే...
TPT: శ్రీకాళహస్తి రూరల్ మండలం చిన్నమిట్ట కండ్రిగ గ్రామపంచాయతీ ఒటిగుంట సెంటర్లో ఓ వ్యక్తి శనివారం హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం K.వెంకటాపురం గ్రామానికి చెందిన గుండుగారి రవి(30)ని ఒటిగుంటకు చెందిన ఆర్ముగం(38) శనివారం కత్తితో నరికి హత్యచేశాడు. రూరల్ సీఐ రవి నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడులో వెంకటేశ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి కళ్లలో కారం కొట్టి కర్రలు, రాడ్లతో దుండగులు దాడి చేసి చంపారు. పాత కక్షల కారణంగానే యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
AP: కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాజులూరు మండలం సలపాకలో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతిచెందారు. పాత కక్షలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముంబాయిలోని ఓ వ్యాపారవేత్తను రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో బాధితుడు రూ.55 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహరంపై స్పందించిన పోలీసులు బాంద్రాలో ఉన్న ఛోటారాజన్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
AP: కృష్ణాజిల్లా కొండాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. విషయం గమనించిన స్థానికులు కారులో ఉన్న మిగతావారిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి ఆరా తీస్తున్నారు.
కృష్ణా: మండవల్లి మండలంలోని అయ్య వారిరుద్రవరం గ్రామ శివారులో జూదం ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను, భైరవపట్నంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు SI రామచంద్రరావు తెలిపారు. అయ్యవారి రుద్రవరంలో రూ.6,420 నగదు, కోడీపందెం వేస్తున్న వారి వద్ద నుంచి రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
TG: రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బాలురు బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ పీఎస్ పరిధిలో జరిగింది. కాగా, బాలిక కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలికపై అఘాయిత్యం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జార్ఖండ్‌లోని బొకారోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. 50కి పైగా బాణసంచా షాప్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.