విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపల్‌ను ఓ విద్యార్థి కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఛతర్‌పుర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సక్సెనా ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజుటి లాగే పాఠశాలకు వెళ్లిన సక్సెనాపై ఓ విద్యార్థి కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థిని మందలించటంతో ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. కాల్పుల తర్వాత ఆ విద్యార్థి ప్రిన్సిపల్ స్కూటర్ పైనే పరారయ్యాడు.