ప్రకాశం: చీమకుర్తి నుంచి గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు హైవేపై తనిఖీలు నిర్వహించామని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ చెప్పారు. సంతనూతలపాడు వద్ద 15 లారీలను నిలిపివేశామన్నారు. బిల్లులను నిర్ధారించేందుకు మైనింగ్ అధికారులకు లేఖ రాశామని చెప్పారు. వారు క్లీయరెన్స్ ఇస్తే లారీలను వదులుతామన్నారు.
ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందగా.. మరో 28 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. బ్రోకౌవా గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
TG: బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ గూడ్స్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రైలు బోగీలో పొగలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలెట్‌లు వంగపల్లి రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని బొగ్గు క్యాబిన్‌లోని పొగలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
విజయనగరం: శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈ క్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను పాల ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కరిముల్లాకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను పాల ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కరిముల్లాకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: విజయవాడలో బిల్డింగ్‌పై నుంచి పడి ఓ వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు.. చింతకాయల ప్రసాద్ అనే వ్యక్తి లారీడ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. శుక్రవారం మద్యం మత్తులో మూడవ అంతస్తుపై నుంచి కింద పడి చనిపోయాడన్నారు. ఈ ఘటనపై తమ్ముడి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.
కడప: పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లి గ్రామంలో నంద్యాల సుబ్బరాయుడు అలియాస్ సుబ్బయ్యపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. గతంలో వీరి మధ్య పాత కక్షలు ఉండేవని దాని మనసులో పెట్టుకొని ఈ దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడ్డ సుబ్బయ్యను చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్సా శివ అప్పలనాయుడుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కడప: ఖాజీపేట మండలం చెర్లోపల్లె గ్రామానికి వెళ్లే దారిలోని కాలువలో ఓ గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉండటం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి ఖాజీపేట మండలం అప్పనపల్లి వాసిగా నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
VZM: పూసపాటిరేగ మండలం వెల్టురు గ్రామంలో బెల్ట్ షాప్న నడుపుతున్న అప్పాయమ్మ అనే మహిళలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి 22 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసారు. ఎక్సైజ్ శాఖ సీఐ ఆధ్వర్యంలో పూసపాటిరేగ ఎక్సైజ్ ఎస్సై ఈ దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
W.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో చైన్ స్నాచింగ్ జరిగింది. తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ వివరాల మేరకు గ్రామంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న పట్నాల ఉమ మహేశ్వరావు భార్య లక్ష్మీ ఇంటి పెరట్లో పనులు చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి మెడలో గొలుసు తెంపు కొని వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
KDP: చక్రాయపేట మండల పరిధిలోని గండికోవూరులో శుక్రవారం ఓ హత్య ఘటన కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న గ్రామం గండికోవూరులో తాజా హత్య ఘటనతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. హరిజనవాడకు చెందిన దండు యోగాంజనేయులు(38)పై నల్ల కదిరిగాళ్ల నాగార్జున తలపై కొయ్యతో కొట్టడంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 999 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ఇండోర్ నుంచి ఢిల్లీ వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. ఎక్స్‌రేలో అనుమానాస్పద ఫొటోలు కనిపించడంతో బ్యాగును తెరచి చూశారు. ఈ క్రమంలో రూ.72.72 లక్షల విలువైన సుమారు కేజీ బంగారంను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కడప: విహారయాత్రకు వచ్చి యువకుడు నీటిలో గల్లంతైన సంఘటన శుక్రవారం చెన్నూరు మండల పరిధిలోని వాటర్ గండి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కడప నగరం అశోక్ నగర్‌కు చెందిన దాట్ల మోహన్ 20మంది స్నేహితులతో కలిసి వాటర్ గండిలో సరదాగా ఈత ఆడుతుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చర్యలు చేపట్టారు.