• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

తాబేళ్ల మృత్యు ఘోష

VSP: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని రుషికొండ బీచ్‌లో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. వరుసుగా మూడు రోజులు సుమారు 15 వరకు తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకువచ్చాయి. శనివారం సాయంత్రం సుమారు 10 తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకురావడంతో పర్యవరణ ప్రియులు, మత్స్యకారులు తీవ్ర ఆవేదన ‍వ్యక్తం చేస్తున్నారు.

December 14, 2024 / 07:34 PM IST

తాబేళ్ల మృత్యు ఘోష

VSP: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని రుషికొండ బీచ్‌లో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. వరుసుగా మూడు రోజులు సుమారు 15 వరకు తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకువచ్చాయి. శనివారం సాయంత్రం సుమారు 10 తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకురావడంతో పర్యవరణ ప్రియులు, మత్స్యకారులు తీవ్ర ఆవేదన ‍వ్యక్తం చేస్తున్నారు.

December 14, 2024 / 07:34 PM IST

గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

E.G: చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం గంజాయితో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని SI శివన్నారాయణ తెలిపారు. ఒడిశా నుంచి కృష జిల్లాకు బైక్‌పై తరలిస్తున్న శిరోజ్, సిద్ధు, ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న యూసఫ్ ఖాన్, మహ్మద్ అలీలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 61కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

December 14, 2024 / 06:50 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని కొత్త బోయినపల్లి అన్నమాచార్య కాలేజ్ వద్ద కడప – చెన్నై ప్రధాన జాతి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి కిరణ్ అతని స్నేహితుడు బన్నీ ఇద్దరు స్కూటర్‌పై  బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో విద్యార్థులు మృతి చెందారు.

December 14, 2024 / 06:47 PM IST

విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

WGL: చెన్నారావుపేట మండలం జల్లిలో విషాదం చోటుచేసుకుంది. జల్లి గ్రామానికి చెందిన రాకేశ్ (16) శనివారం సెల్ ఫోన్‌‌కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌లోని లోపంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.

December 14, 2024 / 06:42 PM IST

పెడనలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడి

కృష్ణా: పెడన మండలం నందిగామ నీటి సంఘం ఎన్నికల్లో ఎన్నికల అధికారి జి. మధుశేఖర్‌పై శనివారం కత్తితో దాడి చేశారు. ఓ పార్టీలో ఇరువర్గాల మధ్య ఆదిపత్య పోరుతో మర్తి వెంకటేశ్వరరావుకి 2 ఓట్లు రావడంతో ఆగ్రహించారు. దీంతో ఆయన ఎన్నికల అధికారి చేతిలో ఉన్న కాగితాలను చింపి అధికారిపై కత్తితో దాడి చేశారు. గాయపడిన ఎన్నికల అధికారి మధుశేఖర్‌ని ఆస్పత్రికి తరలించారు.

December 14, 2024 / 06:40 PM IST

గబ్బిలాల బెడదతో కొబ్బరి చెట్టుకునిప్పు

NDL: బేతంచర్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న గుండా మోహన్ రావు అనే వ్యక్తి ఇంటి పెరటిలో ఉన్న కొబ్బరి చెట్టుకు గబ్బిలాలు అధికంగా ఉండడంతో శనివారం సాయంత్రం నిప్పు అంటించారు. మంటలు పైకి లేవడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కొబ్బరి చెట్టు నిండా గబ్బిలాలు అధికంగా ఉండడంతో కొబ్బరి చెట్టుకు నిప్పంటించినట్లు ఇంటి యజమాని తెలిపారు.

December 14, 2024 / 06:33 PM IST

ఘోర ప్రమాదం.. చిన్నారి మృతి

PLD: పల్నాడు జిల్లా ఈపూరు మండలం కూచినపల్లి సమీపంలో శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర చిన్నారి మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

December 14, 2024 / 06:08 PM IST

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

TG: కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి ఎస్పీ 8 మంది సభ్యులను ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 56.90 లక్షల 500 రూపాయల నోట్లు, కంప్యూటర్, కలర్‌ప్రింటర్, కలర్స్, రిబ్బన్ స్వాధీనం చేసుకున్నారు.

December 14, 2024 / 05:27 PM IST

భూతగాదాలతో వ్యక్తి హత్య

BHPL: కాటారం మండలం దేవరాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భూతగాదాలతో అన్నపై తమ్ముడి కుటుంబీకులు దాడిచేసి, గొడ్డలితో నరికి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సారయ్య(55) తన కొడుకుతో కలిసి బైక్‌పై వెళుతుండగా తమ్ముడి కుటుంబ సభ్యులు గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 05:20 PM IST

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యాయత్నం

ELR: నూజివీడు మండలం పల్లెర్లమోడీ గ్రామంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్(37) అనే వ్యక్తి భార్యతో కుటుంబ తగాదాల విషయమై గొడవపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మందు సేవించినట్లుగా ఏఎస్ఐ శేఖర్ కు వాంగ్మూలం ఇచ్చాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

December 14, 2024 / 05:17 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

TPT: శ్రీకాళహస్తి పట్టణం వీఎం పల్లి వద్ద వంతెనపై లారీ చక్రాల కింద పడి శనివారం యువతి మృతి చెందింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న లారీని తిరుపతి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్న నెల్లూరుకు చెందిన హేమలత (22) ఒవర్టేక్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాగు లారీకి తగిలి లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 04:39 PM IST

ఉరేసుకుని వృద్ధురాలు ఆత్మహత్య

WGL: ఓ వృద్ధురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాయపర్తి మండలం శివరాం తండాలో చోటుచేసుకుంది. బానోత్ హంసి అనే వృద్ధురాలు మనోవేదనతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపర్తి ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

December 14, 2024 / 03:38 PM IST

ముమ్మిడివరంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కోనసీమ: ముమ్మిడివరంలో ఒక బేకరీలో పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్ గౌడ్ (19) అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి బేకరీ నుంచి రూమ్‌కి వెళ్లి నిద్రించిన చేతన్ ఉదయం లేవలేదు. తోటి వారు నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 02:52 PM IST

పేరంపేటలో త్రాచు పాము కలకలం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో శనివారం తెల్ల తాచుపాము జనావాసాల్లో హల్ చల్ చేసింది. గ్రామానికి చెందిన కడిమి గోపి ఇంట్లోకి పాము ప్రవేశించడంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సేవియర్ సొసైటీ అధ్యక్షుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం చాకచక్యంగా పామును పట్టుకున్నారు.

December 14, 2024 / 02:24 PM IST