ATP: గార్లదిన్నె మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక నాగరాజు అనే వ్యక్తి సోమవారం తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
AP: శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన ఇచ్చాపురం మండలంలోని కొఠారి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్‌కు ఎమ్మెల్యే అశోక్ వెళ్లి వస్తుండగా వృద్ధుడిని కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావటంతో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
కోనసీమ: మండపేట మండలం కేశవరం రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని 80 ఏళ్ల వృద్ధ యాచకుడు సోమవారం మృతి చెందాడు. గ్రామంలో యాచకం చేస్తూ జీవనం సాగిస్తున్నాడనీ గ్రామస్తులు చెబుతున్నారు. ఎరుపు తెలుపు గీతల చొక్కా, పట్టు పంచె, పసుపురంగు టవల్ ధరించి ఉన్నాడు. అతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: దువ్వూరు మండలం కానగూడూరులో సోమవారం తండ్రి చేతిలో కొడుకు హత్య గురైన సంఘటన జరిగింది. వివరాలకు వెళితే పీరయ్య గారి హుస్సేన్ భాష(23 ) నిత్యం తాగి ఇంట్లో వారిని వేధిస్తుండగా తండ్రి మాబు షరీఫ్ రోకలి బండతో తలపై కొట్టాడు. హుస్సేన్ భాషను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న దువ్వూరు పోలీసులు హత్యపై కేసు నమోదు చేశారు.
TG: హైదరాబాద్‌లో పోలీసులు కార్ల దొంగలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు జూపూడి ఉషతో సహా మల్లేష్, సాగర్ పాటిల్, అనిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో కార్లను అద్దెకు తీసుకొని మహారాష్ట్ర, కర్ణాటకలో విక్రయిస్తున్నారని, రూ.2.5 కోట్ల విలువైన 21 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.
TG: కన్నడ నటి శోభితది ఆత్మహత్యేనని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. ఆత్మహత్యకు ముందు ఎవరికైనా మెసేజ్ చేసిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. శోభిత పేరెంట్స్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నటనకు దూరంగా ఉండటం, అవకాశాలు లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నట్లు...
ప్రకాశం: చీమకుర్తి మండలంలోని మర్రిపాలెం వద్ద నెల్లూరుకి వెళ్తున్న రెండు లారీలు సోమవారం ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న గ్రానైట్ లారీకి సాంకేతిక లోపం తలెత్తడంతో మధ్యలో ఆగిపోయింది. వెనక వస్తున్న మరో గ్రానైట్ లారీ ప్రమాదవశాత్తు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న గ్రానైట్ లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని ఓ కాలేజి హాస్టల్‌లో ప్రజ్ఞ (17)అనే విద్యార్ధిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. చిన్నతాడ్ గ్రామం బోర్గం మండల్ నిజామాబాద్‌కి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. సెంకడ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞ ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఊరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
TPT: KVB పురం మండలం పూడి-సీకే పురంలో విషాదం చోటు చేసుకుంది. పూడి-సీకే పురం గ్రామానికి చెందిన నక్కలకోన రమేశ్ అనే పశువుల కాపరి మూర్ఛ వ్యాధి వచ్చి అడవిలో పడిపోయాడని గ్రామస్థులు తెలిపారు. కాజ్‌వే దాటలేక అక్కడే వైద్యం చేయడంతో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పూడి-సీకే పురం వద్ద కాజ్‌వే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
ప్రకాశం: అద్దంకి పట్టణంలోని కలవకూరు రోడ్డు నందు నవత ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ వద్ద కాలువలు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బందిని నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లోని రూం నెంబర్ 206లో గత రాత్రి యువకుడి తల బద్దలు కొట్టి దారుణ హత్య చేశారు. గత రాత్రి కొంత మంది యువకులు బార్‌లో రూము తీసుకున్నారని, రాత్రి మద్యం సేవించి గొడవ పడ్డారని, ఉదయం చూసేసరికి ఒకరు హత్యకు గురయ్యారని లాడ్జి సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలోని సుప్రీంకోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చేలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ఇబ్రహీంపట్నంలో జరిగిన పరువు హత్య కేసులో మృతురాలు నాగమణి భర్త శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు నాగమణి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 8 ఏళ్లుగా నాగమణితో ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నాడు. నాగమణి కానిస్టేబుల్ అయ్యేందుకు సహకరించానని, 2021లో నాగమణికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందన్నాడు. గత నెలలో యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నామని వెల్లడి...
రోడ్డు ప్రమాదంలో ఓ యువ IPS మృతిచెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన కర్ణాటక కేడర్ 2023 బ్యాచ్ IPS హర్ష్‌బర్ధన్ (26) ప్రయాణిస్తున్న వాహనం టైరు పగిలి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. బర్ధన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స...