ప్రకాశం: మార్టూరు మండల పరిధిలోని రాజుపాలెం- విజయనగర్ కాలనీ మధ్యలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో మార్టూరు సీఐ శేషగిరిరావు శుక్రవారం దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.72వేలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.