PLD: డోన్ వైపు వెళుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శుక్రవారం వినుకొండ – చీకటిగలపాలెం రైల్వేస్టేషన్ మధ్య డోన్ వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడు నిండు చేతులు చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడన్నారు. చొక్కా మీద ఈధర్ అనే గ్రామం పేరు ఉన్నట్లు చెప్పారు.