ATP: గుంతకల్లు మండలం గుర్రబాడు గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకొని లక్ష్మీ అనే వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనలు మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.