SKLM: టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన పిట్ట రాజేశ్వరి, పిట్ట రామ్మోహన్ అనే భార్యభర్తలపై శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆస్తితగాదాల నేపథ్యంలో భార్యాభర్తలపై దాడి జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన భార్యాభర్తలను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.